• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాహుల్ పేర నకిలీ డ్రైవింగ్ లైసెన్స్

By Staff
|

Rahul Gandhi
పాట్నా: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ పేర బీహార్ రాష్ట్రంలోని సరాన్ జిల్లాలో నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ జారీ అయిది. ఈ విషయాన్ని అధికారులు సోమవారం వెల్లడించారు. వారం క్రితం వరకు జిల్లా అధికారులకు విషయం తెలియలేదు. రాహుల్ పేర ఈ ఏడాది మే 18వ తేదీన జిల్లా రవాణాధికారి పునీత శ్రీవాస్తవ డ్రైవింగ్ లైసెన్స్ ను జారీ చేసినట్లు జిల్లా అధికారులు చెప్పారు.

అధికారులు ఇచ్చిన వివరాల ప్రకారం - ఆ లైసెన్స్ 2022 మే 17వ తేదీ వరకు చెల్లుతుంది. దానిపై రాహుల్ తండ్రి పేరు సరిగానే రాజీవ్ గాంధీ అని ఉంది. శాశ్వత చిరునామా న్యూఢిల్లీలోని సంసద్ మార్గ్ ఉంది. అయితే ఆ లైసెన్స్ పై రాహుల్ గాంధీ చిత్రం లేదు. మరో యువకుడి ఫొటో ఉంది. తాను ఆ లైసెన్స్ ను జారీ చేయలేదని శ్రీవాస్తవ అంటున్నాడు. తనను అప్రతిష్ట పాలు చేయడానికి గతంలో కూడా ఇటువంటి నకిలీ డ్రైవింగ్ లైసెన్లు జారీ చేసినట్లు అతను చెబుతున్నాడు. గతంలో 1990 దశకంలో ఎల్టీటిటిఇ నాయకుడు వి ప్రభాకరన్ పేరు మీద డ్రైవింగ్ లైసెన్స్ జారీ అయింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X