వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపి కటీ పతంగ్: శౌరీ

By Staff
|
Google Oneindia TeluguNews

Arun Shourie
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో మరో తిరుగుబాటు తలెత్తింది. పార్టీ నాయకత్వంపై బిజెపి రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ను ఆయన బ్లండర్ ల్యాండ్ లో అలైస్ గా అభివర్ణించారు. ఎన్డీటివికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సోమవారం సాయంత్రం పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు ప్రకటించారు. పార్టీని ఆయన కటీ పతంగ్ (తెగిన గాలిపటం)గా అభివర్ణించారు. పార్టీని ఆర్ ఎస్ ఎస్ స్వాధీనం చేసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.

రాను రాను పార్టీ ప్రైవేట్ కంపెనీలాగా మారిపోతోందని ఆయన అన్నారు. పార్టీ నాయకత్వాన్ని సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల నుంచి నాయకత్వాన్ని స్వీకరించాలని ఆయన సూచించారు. ఒకరిద్దరిని పార్టీ నుంచి బహిష్కరించడం వల్ల లాభం లేదని, మొత్తం నాయకత్వాన్నే మార్చాలని ఆయన అన్నారు.

ఈ వ్యాఖ్యలకు గాను అరుణ్ శౌరీపై బిజెపి అధికార ప్రతినిధి రాజీవ్ ప్రతాప్ రూఢీ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. అరుణ్ శౌరీ అమరుడిని కావాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. కాగా, అరుణ్ శౌరీపై కూడా బిజెపి నాయకత్వం వేటు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X