• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఢిల్లీలో లష్కరే ఉగ్రవాది అరెస్టు

By Staff
|

New Delhi
న్యూఢిల్లీ: లష్కరే తోయిబా ఉగ్రవాదిగా అనుమానిస్తున్న ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అతని నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తి రైలులో వచ్చి ఢిల్లీలోని అజ్మీరీ గేటు వైపు దిగాడు. అతన్ని మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాలకు అరెస్టు చేసినట్లు డిప్యూటీ పోలీసు కమిషనర్ (ప్రత్యేక విభాగం) అలోక్ కుమార్ చెప్పారు. అతని అనుచరులు ఇద్దరు పారిపోయినట్లు ఆయన చెప్పారు.

అతని వద్ద జమ్మూ కాశ్మీర్ కు చెందినట్లు సలీం పేరు మీద గుర్తింపు కార్డు ఉంది. పాకిస్తానీ పాస్ పోర్టు ఉంది. దాని మీద యూసుఫ్ అని పేరున్నట్లు అలోక్ కుమార్ చెప్పారు. అతని నుంచి నాలుగు డెటొనేటర్లు, రెండు టైమర్లు, రెండు పేలుడు కెమికల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. అతని కొన్ని పత్రాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతను మహారాష్ట్రకు ప్రయాణిస్తున్నట్లు భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X