• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

టీవీఆర్ అరెస్టుపై టిడిపి ఆందోళన

By Staff
|

TV Ramarao
హైదరాబాద్: తమ పార్టీ సభ్యుడు టీవి రామారావు అరెస్టుపై చర్యకు అనుమతించకపోవడంపై తెలుగుదేశం సభ్యులు గురువారం శాససనభలో ఆందోళనకు దిగారు. నర్సింగ్ విద్యార్థినులను లైంగిక వేధించారనే ఆరోపణపై అరెస్టయి, బెయిల్ మీద విడుదలైన టీవీ రామారావు గురువారం తొలిసారి గళం విప్పారు. తనపై అక్రమంగా కేసు పెట్టి వేధిస్తున్నారని ఆయన ప్రభుత్వంపై విమర్శ చేశారు.

టీవీ రామారావు అంశంపై చర్చ జరగకుండా స్పీకర్ సభను అర్థాంతరంగా వాయిదా వేశారని వారు ఆరోపించారు. సభ వాయిదా వేసిన తర్వాత కూడా కొద్దిసేపు తెలుగుదేశం సభ్యులు సభలోనే బైఠాయించారు. స్పీకర్ ను కలవడానికి వారు చేసిన ప్రయత్నం ఫలించలేదు. తెలుగుదేశం సభ్యులను కలవడానికి ఆయన ఇష్టపడకుండా వారికి కనిపించకుండా వెళ్లిపోయారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X