వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ ఏడాది పెళ్లి చేసుకోను: శిల్పా

By Staff
|
Google Oneindia TeluguNews

Raj Kundra-Shilpa Shetty
న్యూఢిల్లీ: ఈ ఏడాది తాను పెళ్లి చేసుకోవడం లేదని బాలీవుడ్ నటి శిల్పాశెట్టి చెప్పారు. ఈ ఏడాది చివరలో లండన్ కు చెందిన వ్యాపారవేత్త రాజ్ కుంద్రాతో తన పెళ్లి జరగవచ్చునని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆమె ఆ విధంగా అన్నారు. తన పెళ్లి విషయమై తాను అధికారికంగా ప్రకటిస్తానని, తన తల్లిదండ్రులు తేదీని ఖరారు చేస్తారని, ఒక నెలకు ముందే తన పెళ్లి గురించి ప్రకటన చేస్తానని ఆమె అన్నారు. వచ్చే ఏడాది చేసుకోవచ్చునని, అయితే అది కూడా కచ్చితంగా చెప్పలేనని ఆమె అన్నారు.

తన పెళ్లి గురించి వచ్చిన వార్తను చూసి తాను నిరాశ చెందానని, చాలా నిస్పృహ ఆవరించిందని, దాని గురించి కాగితాలు వృధా చేస్తున్నారని ఆమె అన్నారు. తన తండ్రి తరుచూ పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేస్తూనే ఉంటాడని, అది వార్తేమీ కాదని ఆమె అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X