వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ముంబై దాడులు అగేవి: పాక్

భారత్ లోనే కాకుండా ఎక్కడైనా ఉగ్రవాద చర్యలకు పాల్పడడానికి తమ దేశాన్ని వాడుకోవడాన్ని తాము సహించబోమని ఆయన అన్నారు. భారత్ నుంచి తమకు తాజా నివేదిక అందిందని, అది పద్ధతుల పాటింపునకు పనికి వస్తుందా, లేదా అనే విషయాన్ని పరిశీలించాల్సి ఉందని ఆయన అన్నారు. ముంబై దాడులపై పాకిస్తాన్ పారదర్శకంగా దర్యాప్తు నిర్వహిస్తోందని ఆయన చెప్పారు. ఐదుగురిని ఈ కేసులో అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. పాక్ నుంచి భారత్ పై ముంబై తరహా దాడులు జరిగే ప్రమాదం ఉందని భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ఇటీవల చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ అందుకు సంబంధించిన సమాచారాన్ని అందివ్వాలని తాము భారత్ ను కోరినట్లు ఆయన తెలిపారు.