కమీనేను నిషేధించండి: పూరీ స్వామి

కమీనే చిత్రంపై ఒరిస్సాలోని పూరిలో పూజారులు ఆందోళనకు దిగారు. చిత్రం పోస్టర్లను దగ్ధం చేశారు. అప్నా హాత్ జగన్నాథ్ అనే నినాదం టాయిలెట్ గోడలపై రాసి ఉన్న దృశ్యాన్ని వారు తీవ్రంగా అభ్యంతర పెడుతున్నారు. కళింగసేన అనే సాంస్కృతిక సంస్థ పూరి పోలీసులకు చిత్రంపై ఫిర్యాదు కూడా చేసింది. చిత్ర నిర్మాతపై పోలీసులు కేసు నమోదు చేశారు.
చిత్ర నిర్మాత క్షమాపణలు చెప్పాలని, కేంద్ర మంత్రి శాఖ దేశంలో చిత్రాన్ని నిషేధించాలని, హిందువుల మనోభావాలను చిత్రం దెబ్బ తీస్తోందని పూరి శంకరాచార్య అన్నారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు, సాక్ష్యాలను సేకరిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications