హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గణేష్ నిమజ్జనం సందర్భంగా అపశృతి దొర్లింది. హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనానికి వచ్చిన ఓ యువకుడి మరణించాడు. గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా కాలు జారి అతను హుస్సేన్ సాగర్ లో పడ్డాడు. దాంతో అతను సాగర్ లో మునిగి చనిపోయాడు. మృతుడు హైదరాబాదులోని మలక్ పేటకు చెందినవాడని సమాచారం. మృతదేహం కోసం గాలింపు చర్యలు సాగుతున్నాయి.