వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాక్సన్ ది హత్యే: దర్యాప్తు అధికారి

By Staff
|
Google Oneindia TeluguNews

Michael Jackson
లాస్ ఏంజెల్స్: పాప్ రారాజు మైఖెల్ జాక్సన్ ది హత్యేనని లాస్ ఏంజెల్స్ దర్యాప్తు అధికారి అన్నారు. జాక్సన్ ఎక్కువ మోతాదులో అనీస్తటిక్ ప్రొపొఫోల్ వాడడం వల్ల మరణించినట్లు ఆ అధికారి చెప్పారు. జాక్సన్ జూన్ 25వ తేదీన మరణించిన విషయం తెలిసిందే. జాక్సన్ మృతికి కారణం తెలిసిందని, ఎక్కువ మోతాదులో ప్రొపొఫోల్ వాడడం వల్లనే మరణించాడని, ఇతర కారణాలు దానికి తోడై ఉంటాయని చెప్పారు.

జాక్సన్ శరీరంలో ప్రొపొఫోల్, లోరజేపామ్ లతో పాటు మిడాజోలం, డైజోపామ్, లిడోకైన్, ఎపిడ్రైన్ ఆనవాళ్లు కనిపించినట్లు తెలిపారు. జాక్సన్ ఫిజిషియన్ డాక్టర్ కోన్రాడ్ ముర్రే ఆ డ్రగ్స్ ఇచ్చినట్లు దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. అయితే మరో వ్యక్తిపై కూడా వారు దృష్టి సారించినట్లు సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X