హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిటిడి స్కామ్ పై విచారణ: సిపిఐ

By Staff
|
Google Oneindia TeluguNews

Narayana
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలక మండలిని రద్దు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాలకమండలిలో విభేదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఆయన ఈ డిమాండ్ చేశారు. పార్టీ శాసనసభా పక్ష నేత గుండా మల్లేష్ తో కలిసి ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. టిటిడి ఆభరణాల కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కూడా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తెలుగుదేశం కొవ్వూరు శాసనసభ్యుడు టీవీ రామారావు విషయంలో ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని ఆయన విమర్శించారు. తన విధేయులకు మాత్రం ప్రభుత్వం కొమ్ముకాస్తోందని, తనకు వ్యతిరేకమైనవారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆయన అన్నారు. వచ్చేనెల 14వ తేదీన కెజీ బేసిన్ గ్యాస్ - రాష్ట్ర అవసరాలు అనే అంశంపై ఫ్యాప్సీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X