వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'జాక్సన్ అతిగా వాడి ఉంటాడు'

By Staff
|
Google Oneindia TeluguNews

Michael Jackson
లండన్: ప్రమాదవశాత్తు పాప్ రారాజు మైఖెల్ జాక్సన్ మోతాదుకు మించి అనీస్తటిక్ డ్రగ్స్ తీసుకుని ఉంటాడని ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ కొన్రాడ్ ముర్రే అన్నారు. ప్రొపోఫోల్ ను మాత్రలను జాక్సన్ ఎక్కువ మోతాదులో ప్రమాదవసాత్తు తీసుకుని ఉంటాడని ముర్రే న్యాయవాదుల బృందం అంటోంది. ప్రొపొఫోల్ ను అధిక మోతాదులో తీసుకోవడం వల్లనే జాక్సన్ మరణించాడని దర్యాప్తు అధికారుల ప్రాథమిక నివేదికలో వెల్లడైన విషయం తెలిసిందే.

జాక్సన్ రక్తంలో 25 మిల్లీగ్రాముల కన్నా మించి ప్రొపొఫోల్ ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. డోస్ ను పెంచుకోవడానికి జాక్సన్ యంత్రాన్ని మార్చుకుని ఉంటాడని, దాని వల్లనే గుండె ఆగిపోయి ఉంటుందని అంటున్నారు. ముర్రే 25 మిల్లీగ్రాముల ప్రొపొఫోల్ మాత్రమే ఇచ్చినట్లు చెబుతున్నాడని, అది నమ్మశక్యం కాదని, నిద్రపోవడానికి 40 మిల్లీ గ్రాములు అవసరమని లండన్ లోని డాక్టర్ కాథ్లీన్ అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X