వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పదవి వదలను: జస్వంత్

By Staff
|
Google Oneindia TeluguNews

Jaswant Singh
న్యూఢిల్లీ: తాను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పిఎసి) చైర్మన్ పదవికి రాజీనామా చేయబోనని బిజెపి బహిష్కృత నేత జస్వంత్ సింగ్ చెప్పారు. పిఎసి చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని బిజెపి నేత సుష్మా స్వరాజ్ తనను కలిసి కోరిన నేపథ్యంలో జస్వంత్ సింగ్ మంగళవారం ఆ విషయం చెప్పారు. పిఎసి పదవిని వదిలి పెడతారా అని మీడియా ప్రతినిధులు అడిగితే రాజీనామా చేయబోనని సమాధానమిచ్చారు.

పిఎసి పదవికి సంబంధించిన నిర్ణయం స్పీకర్ కే ఉంటుందని, అది రాజకీయ పార్టీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పారు. తాను తిరిగి బిజెపిలో చేరే ప్రసక్తి లేదని, సమాజ్ వాదీ వంటి పార్టీలో కూడా చేరబోనని ఆయన చెప్పారు. తనకు బిజెపి తలుపులు మూసుకుపోయినట్లేనని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు ఆవరణలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X