వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సల్స్ కూల్చలేరు: నారాయణన్

By Staff
|
Google Oneindia TeluguNews

NSA
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను నక్సలైట్లు కూల్చే అవకాశం లేదని జాతీయ భద్రతా సలహాదారు ఎంకె నారాయణన్ చెప్పారు. నక్సలైట్లు అంతటి శక్తి లేదని ఆయన అన్నారు. హెలికాప్టర్ లో సాంకేతి లోపం ఏర్పడి ఉంటుందని లేదా పైలట్ పొరపాటు పడి ఉంటారని ఆయన అన్నారు. హెలికాప్టర్ అదృశ్యంలో నక్సలైట్లు ఏ మాత్రం లేదని తాను చెప్పగలనని ఆయన అన్నారు.

ప్రభుత్వం హెలికాప్టర్ కోసం లేదా దాని శకలాల కోసం, ముఖ్యమంత్రి కోసం, ఆయన కార్యదర్శి కోసం, వ్యక్తిగత భద్రతాధికారి కోసం గాలింపు చేపట్టేందుకు కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. అచూకీ దొరికేంత వరకు గాలింపు కొనసాగుతుందని ఆయన చెప్పారు. దేశం ముఖ్యమంత్రి భద్రతపై ఆందోళన చెందుతోందని, కేంద్ర, రాష్ట్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయని, వైమానిక సాయుధ బలగాల హెలికాప్టర్, సుఖోయ్ విమానాలు గాలింపు చేపడుతున్నాయని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X