వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జెట్ ఎయిర్ వేస్ ఫ్లైట్లకు బ్రేక్ లు

By Staff
|
Google Oneindia TeluguNews

Jet Airways
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్ వేస్ విమానాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ముంబై, ఢిల్లీ తదితర విమానాశ్రయాల్లో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. దేశవ్యాప్తంగా 400 మందికి పైగా పైలట్లు సామూహికంగా సిక్ లీవ్ లు పెట్టారు. మంగళవారం తెల్లవారు జాము నుంచి జెట్ ఎయిర్ వైస్ విమానాలు నిలిచిపోయాయి. ముంబై, ఢిల్లీ, బెంగుళూర్, జైపూర్, భోపాల్, అహ్మదాబాద్ వంటి పలు సెక్టార్లలో దేశీయ విమానాలు రద్దయ్యాయి.


విమానాలను క్లబ్ చేయడం, ప్రయాణికులను ప్రత్యామ్నాయ విమానాల్లో సర్దడానికి ప్రయత్నించడం వంటి చర్యలకు జెట్ ఎయిర్ వైస్ యాజమాన్యం పూనుకుంది. ఇద్దరు సీనియర్ పైలట్లను తీసేయడానికి నిరసనగా పైలట్లు మంగళవారం తెల్లవారు జాము నుంచి సమ్మెకు దిగారు. ప్రయాణికుల కష్టాలను తగ్గించడానికి, సాధ్యమైనన్ని ఎక్కువ విమానాలను నడపడానికి యాజమాన్యం ప్రయత్సిస్తోందని ఒక ప్రకటనలో తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X