వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాల్ బహదూర్ శాస్త్రి వాచీ చోరీ

By Staff
|
Google Oneindia TeluguNews

Lal Bahadur Shastri
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి చేతి గడియారం చోరీకి గురైంది. లాల్ బహదూర్ శాస్త్రి మెమోరియల్ లో ఉన్న ఆ గడియారం విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.1966లో తాష్కెంట్ సమావేశం సందర్భంగా అప్పటి రష్యా ప్రధాని అలెక్సీ కోసిగిన్ శాస్త్రికి ఆ బంగారం గడియారాన్ని బహూకరించారు. ఆ గడియారాన్ని సోనియా గాంధీ నివాసానికి పక్కనే ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి మెమోరియల్ లో ఉంచారు.

ఆ గడియారం సెప్టెంబర్ 3వ తేదీననే కనిపించకుండా పోయింది. అయితే నాలుగు రోజుల తర్వాత వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తామే గడియారం కోసం వెతికామని, దొరకకపోవడంతో సెప్టెంబర్ 7వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశామని అధికారులు చెబుతున్నారు. అత్యంత చారిత్రక ప్రాధాన్యం గల మ్యూజియంలోని వస్తువులకు సరైన భద్రత లేదు. గడియారం చోరీపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X