హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎఎల్పీపై వైయస్ జగన్ లాబీ దృష్టి

By Staff
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: జాప్యం జరిగే కొద్దీ అధికారం చేజారి పోతుందనే భయం దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి శిబిరంలో నెలకొని ఉంది. సాధ్యమైనంత త్వరగా కాంగ్రసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) సమావేశం జరిగేలా చూడాలని ఆ శిబిరం అభిప్రాయపడుతోంది. దాని కోసమే ఆ వర్గం ఒత్తిడి రాజకీయాలను ఎంచుకుంది. దాని వల్ల ఇప్పటికే కొంత ఫలితం సాధించామని కూడా అనుకుంటోంది. అలా చేయడం వల్లనే సంప్రదింపుల కోసం కెవిపి రామచందర్ రావును అధిష్ఠాన వర్గం ఢిల్లీకి పిలిపించిందని, లేకుంటే ఇంకా జాప్యం చేసి ఉండేదని అంటోంది. ఆలస్యం జరిగే కొద్దీ ఒత్తిడి తేవడం కష్టమవుతుంది. వాతావరణం చల్లబడితే కష్టమని భావిస్తోంది.

మరి కొంత కాలం రోశయ్యను ముఖ్యమంత్రిగా కొనసాగించవచ్చుననే ఆందోళనలో కూడా జగన్ శిబిరం ఉంది. అది జరగకుండా చూడడం ఇప్పుడు ఆ వర్గం కర్తవ్యంగా కనిపిస్తోంది. ఈ నెల 10, 11 తేదీల్లో సిఎల్పీ సమావేశం జరుగుతుందని భావిస్తోంది. వైయస్ సంతాప దినాలు ముగిసే వరకు తాము కొత్త నేతపై దృష్టి సారించబోమని పార్టీ అధిష్ఠాన వర్గం చెబుతోంది. సమయం తీసుకోవడానికి మాత్రమే అధిష్ఠాన వర్గం ఆ మాట చెబుతుందనేది తెలిసిపోతూనే ఉంది. ఇదే సమయంలో అన్ని వర్గాల నుంచి జగన్ కు మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక వైపు ఆందోళనల ద్వారా ఒత్తిడి పెడుతూ, మరోవైపు శాసనసభ్యుల పూర్తి మద్దతు సంపాదించడం ద్వారా అధిష్ఠాన వర్గం అభిప్రాయాన్ని జగన్ కు అనుకూలంగా మలచాలనేది ఆ శిబిరం ఆలోచనగా తెలుస్తోంది.

అయితే, కొత్త నేత ఎంపిక అంత ఆషామాషీగా జరిగే వ్యవహారం కాదు. కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం తన నిర్ణయానికి అనుకూలంగా శాసనసభ్యులు అభిప్రాయాన్ని కూడగట్టుకున్న తర్వాతనే సిఎల్పీ సమావేశానికి పూనుకుంటుంది. వైయస్ జగన్ కు ముఖ్యమంత్రి పదవి అప్పగించాలంటే అది అవసరం లేదేమో గానీ మరొకరిని ఎంపిక చేయదలుచుకుంటే మాత్రం కసరత్తుకు ఎక్కువ కాలమే పడుతుంది. అయితే ఇప్పటికిప్పుడు వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తారని కూడా అనుకునే పరిస్థితి లేదు. అధిష్ఠాన వర్గం జగన్ కు అనుకూలంగా నిర్ణయం తీసుకోదలుచుకున్నా ఇప్పటికిప్పుడు ఒత్తిడికి తలొగ్గినట్టు కనిపిస్తుంది. అలా తలొగ్గినట్లు కనిపించకుండా ఉండడానికి కూడా సమయం తీసుకోవచ్చు. ఏమైనా జగన్ కోసం పెద్ద యెత్తున ఢిల్లీలో లాబీయింగ్ జరుగుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X