వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లి వార్తలపై రాణీ ముఖర్జీ గోడు

By Staff
|
Google Oneindia TeluguNews

Rani Mukherjee
ముంబై: తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాలపై బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ మనస్తాపానికి గురవుతోంది. గత మూడేళ్లుగా తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాం తన కేరీర్ ను దెబ్బ తీస్తున్నట్లు ఆమె ఒక వార్తా సంస్థ ప్రతినిధితో అన్నది. చాలా మంది దర్శకులు తనను సంప్రదిస్తున్నారని, అయితే పెళ్లి చేసుకుంటున్నారా అని అడుగుతున్నారని, తాను వారి ప్రాజెక్టులకు న్యాయం చేస్తానా లేదా అనే సందేహపడుతున్నారని ఆమె వివరించింది. తాను గత మూడేళ్లుగా ఎవరినీ పెళ్లి చేసుకోలేదని ఆమె బాధతో అన్నది.

జుహు భవంతి కలిసి రాకపోవడంతో పాత ఇంటికి మారుతున్నట్లు వచ్చిన వార్తలను కూడా ఆమె ఖండించింది. కొత్త భవనాన్ని తాను తన కుటుంబం కోసం తీసుకున్నానని, తన శ్రమతో, చెమటరక్తం ఓడ్చి దాన్ని కట్టుకున్నానని, అది తన దేవాలయం అని, దాని నుంచి ఎలా పారిపోతానని, తాను అభద్రతా భావానికి గురయ్యే వ్యక్తిని కానని ఆమె అన్నది. నిరాధారమైన వార్తలు తనకు నష్టం చేస్తున్నాయని ఆమె తన గోడు వెళ్లబోసుకుంది.

ఆదిత్యా చోప్రాను వివాహం చేసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలను కూడా ఆమె ఖండించింది. తాను తల్లిదండ్రులకు ఒకతే కూతురు అని, పెళ్లి చేసుకోవాలనుకుంటే బహిరంగంగా ప్రకటిస్తానని ఆమె చెప్పింది. ఊహాగానాలకు సమాధానం చెప్పి సమయం వృధా చేసుకునే బదులు తాను తన చిత్రాలపై దృష్టి పెడతానని ఆమె అన్నది. దిల్ బోలే హడ్డిపలో తాను బికినీ ధరించలేదని రాణీ ముఖర్జీ స్పష్టం చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X