వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాడెన్ మరణించాడు: జర్దారీ

By Staff
|
Google Oneindia TeluguNews

Asi Ali Zardari
ఇస్లామాబాద్: ఆల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ మరణించాడని పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ చెప్పారు. అయితే లాడెన్ దాక్కున్నాడని అమెరికా భావిస్తున్న ప్రాంతాల్లో సైనిక చర్యను పెంచడానికి తమకు మరింత సాయం కావాలని ఆయన అన్నారు. మిలిటెంట్ల అణచివేతకు ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. వనరుల కొరత వల్ల కొంత మేరకు ఆటంకం ఏర్పడుతోందని ఆయన చెప్పారు.

తాను పదవి చేపట్టి ఏడాది గడిచిన సందర్బంగా ఆయన బిబిసికి ఇంటర్వ్యూ ఇచ్చారు. తమ ఆర్థిక పరిస్థితి మెరుగుకు పాశ్చాత్య దేశాల నుంచి మరింత సహాయం కావాలని ఆయన అన్నారు. అఫ్ఘాన్ సరిహద్దుల్లో ఉగ్రవాదుల అణచివేతకు తనకు మరింత సమయం, మరిన్ని వనరులు అవసరమని అభిప్రాయపడ్డారు. తాలిబాన్ మిలిటెంట్లపై తాము కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. లాడెన్ మరణించాడని ధృవీకరించే ఆధారాలను ఆయన చూపలేకపోయారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X