హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కృషి వెంకటేశ్వర రావు విడుదల

By Staff
|
Google Oneindia TeluguNews

Venkateswara Rao
హైదరాబాద్: కృషి బ్యాంక్ చైర్మన్ కొసరాజు వెంకటేశ్వర రావు శుక్రవారం హైదరాబాదులోని చంచల్ గుడా జైలు నుంచి విడుదలయ్యారు. కృషి బ్యాంక్ ఖాతాదారులను మోసం చేసిన కేసులో ఆయన గత మూడేళ్లుగా జైలులో ఉంటున్నారు. ఆయనకు గురువారం సాయంత్రం నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు పత్రాలు శుక్రవారం మధ్యాహ్నం అందగానే జైలు అధికారులు ఆయనను విడుదల చేశారు.

1998లో వెంకటేశ్వర రావు కృషి కో ఆపరేటివ్ బ్యాంక్ ను స్థాపించారు. అయితే ఖాతాదారులను మోసం చేశారని ఆయనపై కేసు నమోదైంది. దాంతో అతను 2001లో పరారయ్యాడు. ఈ కేసు దర్యాప్తును సిఐడి చేపట్టింది. అతను ఎట్టకేలకు 2005లో థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లో పట్టుబడ్డారు. 2006లో రాష్ట్ర పోలీసులు ఆయనను రాష్ట్రానికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్లేవీ ఆయనకు ఫలితాన్ని ఇవ్వలేదు. ఎట్టకేలకు గురువారం ఆయనకు బెయిల్ లభించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X