వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాలిబాన్ నేత ముస్లిం ఖాన్ అరెస్టు

By Staff
|
Google Oneindia TeluguNews

Muslim Khan
ఇస్లామాబాద్: స్వాత్ లోయలో తాము తాలిబాన్ అధికార ప్రతినిధి ముస్లిం ఖాన్ ను అరెస్టు చేసినట్లు పాకిస్తాన్ సైన్యం శుక్రవారం ప్రకటించింది. అతనితోపాటు ప్రముఖ నాయకుడిని, మరో ముగ్దుని కూడా అరెస్టు చేసినట్లు తెలిపింది. అరెస్టయిన ముస్లింఖాన్ పై, తాలిబాన్ కమాండర్ మెహమూద్ ఖాన్ లపై ప్రభుత్వం పది మిలియన్ రూపాయలేసి రివార్డులు ప్రకటించిది. స్వాత్ లో జరిపిన ఆపరేషన్ లో వీరు పట్టుబడినట్లు పాకిస్తాన్ ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది.

మరో ముగ్గురు మిలిటెంట్లను ఫాజీ గఫార్, అబ్దుల్ రెహ్మాన్, సర్తాజ్ లుగా గుర్తించారు. పాకిస్తాన్ సైన్యం పట్టుకున్న తొలి తాలిబాన్ అగ్రనేత ముస్లిం ఖాన్ కావడం విశేషం. స్వాత్ లో గత నాలుగు నెలలుగా జరుపుతున్న ఆపరేషన్ లో 1,800 మంది మిలిటెంట్లను హతమార్చినట్లు పాకిస్తాన్ తెలిపింది. స్వాత్ లోయపై పాకిస్తాన్ సైన్యం నియంత్రణ సాధించినప్పటికీ గత కొద్ది వారాలుగా ఆత్మాహుతి దాడులు జరుగుతున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X