వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాక్ పై హిల్లరీకి చిదంబరం ఫిర్యాదు

అది సరిపోతుందని తాను అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ముంబై దాడుల తర్వాత భారత్ అనుసరించిన విధానాన్ని, పాకిస్తాన్ ను తాము సంప్రదించిన విషాయన్ని అమెరికా అర్థం చేసుకుంటుందని భావిస్తున్నానని ఆయన అన్నారు. సయీద్ పై సాక్ష్యాధారాలతో కూడిన ఐదు నివేదికలు ఇచ్చినప్పటికీ పాకిస్తాన్ సయీద్ ను వదిలివేయడాన్ని హిల్లరీకి వివరించినట్లు ఆయన చెప్పారు. సరిహద్దు గుండా పాకిస్తాన్ నుంచి భారత్ లోకి చొరబాట్ల పట్ల భారత్ ఆందోళన చెందుతోందని ఆయన చెప్పారు. పాకిస్తాన్ ను కేంద్రంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు దిగే పరిస్థితి రూపుమాసిపోలేదని ఆయన అన్నారు.