వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అహుజా బెయిల్ పిటిషన్ తోసివేత

By Staff
|
Google Oneindia TeluguNews

Shiney Ahuja
ముంబై: తన నివాసంలో పనిమనిషిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో బాలీవుడ్ నటుడు షైనీ అహుజా బెయిల్ పిటిషన్ రెండోసారి తిరస్కరణకు గురైంది. అహుజా బెయిల్ పిటిషన్ ను ముంబై సెషన్స్ కోర్టు శుక్రవారం తిరస్కరించింది. అహుజాపై కేసు తీవ్ర నేరానికి సంబందించిందని, అతను నేరానికి పాల్పడినట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయనే కారణాలు చెప్పి కోర్టు బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిది.

అవే కారణాలతో జులై 8వ తేదీన అహుజా బెయిల్ పిటిషన్ ను మొదటిసారి కోర్టు తిరస్కరించిది. 35 ఏళ్ల బాలీవుడ్ నటుడు అహుజా సెప్టెంబర్ 5వ తేదీన రెండో సారి బెయిల్ పిటిషన్ పెట్టుకున్నాడు. అతనిపై పోలీసులు చార్జీషీట్ దాఖలు చేశారు. అతను ప్రస్తుతం ఆర్థర్ రోడ్ జైలులో ఉన్నాడు. అతనిపై సెప్టెంబర్ 23వ తేదీన అభియోగాలు మోపే అవకాశం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X