శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టెక్కలిలో కాంగ్రెసు విజయం

By Staff
|
Google Oneindia TeluguNews

Revathipathi
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా టెక్కలి శాసనసభ ఉప ఎన్నికలో కాంగ్రెసు పార్టీ విజయం సాధించింది. కాంగ్రెసు అభ్యర్థి కొర్ల భారతి 7,173 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆమె తన సమీప తెలుగుదేశం అభ్యర్థి అచ్చెన్నాయుడిపై విజయం సాధించారు. టెక్కలి సీటుకు జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు సోమవారం జరిగింది. ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్ లోనూ భారతి ఆధిక్యం కొనసాగింది.

కాంగ్రెసు శాసనసభ్యుడు రేవతీపతి ఆకస్మిక మృతితో టెక్కలికి ఉప ఎన్నిక జరిగింది. కాంగ్రెసు అభ్యర్థిగా రేవతీపతి భార్య పోటీ చేశారు. ఈ నెల 10వ తేదీన టెక్కలి ఉప ఎన్నికకు పోలింగ్ జరిగింది. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ మూడో స్థానంలో నిలిచాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X