శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎల్పీపై హైకమాండ్ దే నిర్ణయం: డిఎస్

By Staff
|
Google Oneindia TeluguNews

Srinivas
హైదరాబాద్: కొత్త నేత ఎంపిక కోసం పార్టీ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) సమావేశాన్ని ఎప్పుడు ఏర్పాటు చేయాలనే విషయంపై పార్టీ అధిష్ఠాన వర్గమే నిర్ణయం తీసుకుంటుందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. సిఎల్పీ, పిసిసి సమావేశాలకు మధ్య ఎటువంటి సంబంధం లేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. అత్యంత క్లిష్టపరిస్థితిలో కాంగ్రెసు టెక్కలి సీటును గెలుచుకుందని ఆయన అన్నారు. పార్టీ గొప్ప నాయకుడైన వైయస్ రాజశేఖర రెడ్డిని కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో ఇతర పార్టీలు అవకాశంగా తీసుకుని ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించాయని, ఆ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారని ఆయన అన్నారు.

టెక్కలి ఉప ఎన్నిక ఫలితాన్ని దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి అంకితమిస్తున్నట్లు ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో కూడా కాంగ్రెసు విజయపరంపర ఇలాగే కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గెలుపు వార్తను ఫోన్ లో పార్టీ అధిష్ఠాన వర్గానికి తెలిపినట్లు ఆయన చెప్పారు. సానుభూతి వల్లనే కాంగ్రెసు విజయం సాధించిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యను ఆయన కొట్టి పారేశారు. సహజ పరిణామాలను కూడా చంద్రబాబు తనకు అనుకూలంగా మలుచుకోవాలని అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X