హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ సిఎం కావాలి: రోజా

By Staff
|
Google Oneindia TeluguNews

Roja
హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవిని వైయస్ జగన్మోహన్ రెడ్డికే ఇవ్వాలని తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెసులో చేరడానికి సిద్ధపడిన తెలుగు సినీ నటి రోజా అన్నారు. ఆమె ఒక ప్రైవేట్ తెలుగు టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. జగన్ ముఖ్యమంత్రి కావాలనేది తన అభిప్రాయం మాత్రమే కాదని, ప్రజల అభిమతమని ఆమె అన్నారు. వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిగా చూడాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని ఆమె అన్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను నెరవేర్చగల నాయకుడు జగన్ మాత్రమేనని ఆమె అన్నారు.

తనపై తెలుగుదేశం పార్టీ నాయకులు దుష్ప్రచారం చేశారని, తనపై వారు చేసిన వ్యాఖ్యల వల్లనే తనకు మనస్తాపం కలిగిందని ఆమె అన్నారు. వారు పంపిన మెసేజ్ వల్లనే గంగా భవానీ వంటి కాంగ్రెసు నాయకులు కూడా తనపై దురభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకున్నారని ఆమె అన్నారు. తాను తన భర్త, సోదరుడి అభిప్రాయాలు తీసుకున్నప్పటికీ సొంత నిర్ణయాలే తీసుకుంటానని, కాంగ్రెసులో చేరాలనేది తన సొంత నిర్ణయమేనని ఆమె అన్నారు. సినీ కళాకారులకు ఆత్మగౌరవం ఉంటుందని, వారికి డబ్బుకు, కీర్తికి లోటుండదని, వారు రాజకీయంలోకి వచ్చి ఆశించేదేమీ ఉండదని ఆమె అన్నారు. వైయస్ తో 20 నిమిషాలు మాట్లాడిన తర్వాత తన అభిప్రాయం మారిందని, తాను కాంగ్రెసు పార్టీలో చేరాలనే నిర్ణయానికి వచ్చానని, నిజానికి తాను కాంగ్రెసులో చేరాలని వైయస్ కలవలేదని, కలిసిన తర్వాతనే తన అభిప్రాయం మారిందని ఆమె వివరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X