హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెవిపితో మామూలు మాటలే: రోశయ్య

By Staff
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మీయ మిత్రుడు కెవిపి రామచందర్ రావుతో తాను మాట్లాడడంలో ప్రత్యేకత ఏమీ లేదని ముఖ్యమంత్రి కె. రోశయ్య చెప్పారు. మంగళవారం రాత్రి కెవిపితో జరిపిన సంభాషణల్లో ప్రత్యేకత ఏమీ లేదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. అవసరం వచ్చినప్పుడు తాను మాట్లాడుతానని, అవసరం వస్తే కెవిపి తనతో మాట్లాడుతారని ఆయన చెప్పారు. మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నకు ఆయన ఆ వివరణ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవ్యంగానే ఉందని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కన్నా ముందే తాము వృధా ఖర్చులను తగ్గించామని ఆయన చెప్పారు. ఓట్ ఆన్ అకౌంట్ కేటాయింపుల్లో స్వల్ప మార్పులు చేసి అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు.

తమ ప్రాధాన్యతల్లో కూడా స్వల్పంగా మార్చామని, అయితే దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి మొదలు పెట్టిన కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని ఆయన చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రపంచ ఆర్థిక మాంద్యం ప్రభావం ఉందని, అయితే ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా లేదని ఆయన అన్నారు. స్వైన్ ఫ్లూ వ్యాధి నివారణకు అన్ని చర్యలూ తీసుకున్నామని, తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదట స్వైన్ ఫ్లూపైనే సమీక్ష జరిపానని ఆయన చెప్పారు. అయితే ప్రజలను చైతన్యవంతులను చేయడానికి మీడియా సహకారం అవసరమని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X