నిజాంను కించపరిచారు: కెసిఆర్

తెలంగాణకు చెందిన రాజులను, చరిత్రను, స్వతంత్రాన్ని ఆంధ్ర దురాక్రమణ దారులు వక్రీకరిస్తున్నారని ఆయన అన్నారు. ఇలాంటి దురాక్రమణదారుల వక్రీకరణలను సహించబోమని, వారికి గుణపాఠం చెబుతామని ఆయన అన్నారు. తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవాన్ని అధికారంగా ప్రభుత్వం ఎందుకు నిర్వహించదని ఆయన ప్రశ్నించారు. ఆగస్టు 15వ తేదీని అధికారికంగా నిర్వహిస్తున్నప్పుడు సెప్టెంబర్ 17వ తేదీన అధికారికంగా నిర్వహించడం న్యాయమని ఆయన అన్నారు. తెలంగాణ చరిత్ర వక్రీకరణ భయంకరంగా జరుగుతోందని, వార్తా పత్రికలు కూడా అదే ధోరణితో వ్యవహరిస్తున్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications