తొలిసారి సి - బ్లాక్ నుంచి రోశయ్య

నిత్యావసర ధరల అదుపునకు జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. స్వైన్ ఫ్లూపై, గిరిజన ప్రాంతాల్లో విషజ్వరాలపై అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. దాన్ని కేవలం ఆరోగ్య శాఖకు చెందిన అంశంగానే చూడవద్దని, అన్ని శాఖలూ అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. దివంగత ముఖ్యమంత్రికి అత్యంత ఇష్టమైన ఆరోగ్యశ్రీ అమలుపై అలసత్వం తగదని ఆయన హెచ్చరించారు. కరువు నివారణ చర్యలపై కూడా ఆయన సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications