వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబా రామ్ దేవ్ పై అయేషా గుర్రు

By Staff
|
Google Oneindia TeluguNews

Ayesha Takia
ముంబై: నటులపై చేసిన వ్యాఖ్యలకు బాబా రామ్ దేవ్ పై బాలీవుడ్ నటి అయేషా టకియా ఆగ్రహం వ్యక్తం చేశారు. బరువు తగ్గి వాంటెడ్ సినిమాలో అందాలు ఆరబోసిన ఆమెకు అన్ని వైపుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఆ గౌరవం బాబా రామ్ దేవ్ కే దక్కుతుందని అంటూనే ఆమె ఆయనపై విరుచుకుపడింది. బాబా రామ్ దేవ్ యోగా ఎంతో మంచిదని, బాబా రామ్ దేవ్ జ్ఞాని అని, మతపరంగా కూడా తాను ఆయనను ఆనుసరిస్తానని అంటోంది.నటులకు వ్యక్తిత్వం లేదని బాబా చేసిన వ్యాఖ్యలు తనకు కోపం తెప్పించాయని అంటోంది.

బాబా ఆ విధమైన సాధారణీకరణ వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని ఆమె అభిప్రాయపడింది. బాబా తనను ఒకసారి యోగా సెషన్ కు ఆహ్వానించాడని, అయితే పెద్ద గుంపు ఉండడంతో తాను హాజరు కాలేకపోయానని ఆమె చెప్పింది. తిండి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటానని, తనకు సంబంధించినంత వరకు డైటింగ్ కడుపు మాడ్చుకోవడం కాదని ఆమె తన అందాల రహస్యం గుట్టు విప్పింది. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలనే తీసుకుంటానని ఆమె అంటోంది. తన తల్లి ఎరోబిక్ ఇన్ స్ట్రక్టర్ అని, ఆమె తనకు సలహాలు ఇస్తుందని అయేషా చెప్పింది. తాను, తన సోదరి నటాషా, తల్లి కలిసి పని చేస్తామని ఆమె చెప్పింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X