• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సయీద్ ను విచారించాల్సిందే: చిదంబరం

By Staff
|

Chidambaram
చెన్నై: ముంబై దాడుల కేసులో జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ ను పాకిస్తాన్ విచారించాల్సిందేనని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం అన్నారు. సయీద్ ను విచారించడానికి అవసరమైన సాక్ష్యాలన్నీ పాకిస్తాన్ లోనే ఉన్నాయని ఆయన అన్నారు. సయీద్ ను గృహ నిర్బంధం చేయడం పాకిస్తాన్ మభ్య పెట్టడానికైతే తనకేమీ అభ్యంతరం లేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ముంబై దాడుల కేసులో అరెస్టు చేసిన పాకిస్తాన్ సయీద్ ను విచారించాలని ఆయన అన్నారు. ముంబై దాడుల్లో అతని పాత్రపై దర్యాప్తు జరపాలని ఆయన అన్నారు.

సాక్ష్యాలు అడిగితే అవి భారత్ లో లేవని పాకిస్తాన్ లోనే ఉన్నాయని ఆయన అన్నారు. పాకిస్తాన్ లోనే విచారించి, పాకిస్తాన్ లోనే సాక్ష్యాలను సేకరించాలని ఆయన అన్నారు. సయీద్ పై ఎఫ్ఐఆర్ ముంబై దాడుల కేసులో నమోదు చేయలేదని ఆయన గుర్తు చేశారు. ముంబై దాడుల సూత్రధారి సయీదేనని, అందుకే సయీద్ ను ముంబై దాడుల కేసులో విచారించాలని తాము పట్టుబడుతున్నామని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X