• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గృహ నిర్బంధంలో హఫీజ్ సయీద్

By Staff
|

Hafiz Mohammad Saeed
లాహోర్: ముంబై దాడుల సూత్రధారి, జమాత్ ఉద్ దావా చీఫ్ హఫీజ్ సయీద్ కు పాకిస్తాన్ గృహ నిర్బంధం విధించింది. జమాత్ ఉద్ దవా నేత హపీజ్ మొహమ్మద్ సయీద్ కదలికలపై పాకిస్తాన్ పోలీసులు ఆంక్షలు విధించారు. గడ్డాఫీ మైదానంలో జరిగే ఈద్ ప్రార్థనలకు వెళ్లకుండా ఆయనను నిషేధించింది. సయీద్ కదలికలపై ఆంక్షలు విధిస్తూ ఆయన ఇంటి వెలుపల పోలీసులను మోహరించినట్లు జియో న్యూస్ తెలిపింది.

సయీద్ ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించార. అయితే అతన్ని అధికారికంగా గృహ నిర్బంధం విధించారా, లేదా తెలియడం లేదు. భద్రతా కారణాల రీత్యానే సయీద్ కదలికలపై ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. దానిపై అధికారిక సమాచారమేదీ లేదు. సయీద్ గృహ నిర్బంధాన్ని భారత హోం మంత్రి చిదంబరం సీరియస్ గా పరిగణించలేదు. ముంబై దాడుల కేసులో సయీద్ ను విచారించాలని ఆయన డిమాండ్ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X