వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనూషకు మురళీమోహన్ చేయూత

By Staff
|
Google Oneindia TeluguNews

Murali Mohan
రాజమండ్రి: ప్రేమోన్మాది దాడిలో తల్లిదండ్రులను కోల్పోయి, తాను గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని అనూష చెల్లెళ్లకు సాయం అందించడానికి సనీ నటుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు మురళీమోహన్ ముందుకు వచ్చారు. వారి చదువుల ఖర్చును ఆయన భరిస్తారు. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి అనూషకు తెలిపారు. ఆమె సోమవారంనాడు అనూషను పరామర్శించారు.

కాగా, ముఖ్యమంత్రి కె.రోశయ్య అనూషను ఫోన్ లో పరామర్శించారు. ఆయన సోమవారం ఉదయం అనూషకు ఫోన్ చేసి పలకరించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అనూషకు అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వ సాయం సాధ్యమైనంత త్వరగా అందించడానికి ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ప్రేమోన్మాది రాజేష్ అనూషపై దాడి చేయడమే కాకుండా ఆమె తల్లిండ్రులను హత్య చేసిన విషయం తెలిసిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X