వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శశి థరూర్ కు సోనియా క్లాస్

By Staff
|
Google Oneindia TeluguNews

Shashi Tharoor
న్యూఢిల్లీ: కేంద్ర సహాయ మంత్రి శశి థరూర్ కు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ క్లాస్ తీసుకున్నారు. ఇక వివాదాల జోలికి వెళ్లవద్దని ఆమె థరూర్ కు సూచించారు. తాను చేసిన క్యాటిల్ క్లాస్ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు ఆయన మంగళవారం సోనియాను కలిశారు. వివాదం చెలరేగిన సమయంలో ఆయన లైబేరియా, ఘనా పర్యటనల్లో ఉన్నారు. ఇక్కడికి చేరుకున్న వెంటనే ఆయన సోనియాను కలుసుకున్నారు.

సోనియాతో ఆయన 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఆ తర్వాత మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు స్పందించకుండా వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని కలుసుకున్నారు. క్యాటిల్ క్లాస్ వ్యాఖ్యలు చేసినందుకు థరూర్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెసు నాయకుల నుంచే డిమాండ్లు వచ్చాయి. దీంతో తీవ్ర వివాదం చెలరేగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X