చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నటి వరలక్ష్మి కన్నుమూత

By Staff
|
Google Oneindia TeluguNews

Varalaxmi
చెన్నై: ప్రముఖ తెలుగు చలనచిత్ర నటి ఎస్. వరలక్ష్మి చెన్నైలో మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఆమె వయస్సు 84 ఏళ్లు. బాలరాజు సినిమాతో ఆమె కథానాయికగా తెలుగు చలనచిత్ర సీమలో అడుగు పెట్టారు. నిజానికి ఆమె చలనచిత్ర రంగ ప్రవేశం బాలనటిగానే ప్రారంభమైంది. తొమ్మిదేళ్ల వయస్సులోనే ఆమె బాలయోగిని చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. మంచి గాత్రం, సహజ నటనతో ఆమె దక్షిణాది ప్రేక్షకులను అలరించారు. ఆమె తెలుగులోనే కాకుండా తమిళం, తదితర దక్షిణాది భాషల్లో నటించారు. పదేళ్ల కిందట కమల హాసన్ హీరోగా చేసిన గుణ చిత్రంలో ఆమె చివరి సారి నటించారు. ఈ సినిమాలో ఆమె కమల హాసన్ కు తల్లిగా నటించారు. ఆరు నెలల కిందట వృద్ధాప్యం కారణంగా జారి పడి గాయాలకు గురయ్యారు. అప్పటి నుంచి ఆమె మంచానికే పరిమితమయ్యారు.

మహామంత్రి తిమ్మరసు, వెంకటేశ్వర మహాత్మ్యం వంటి తెలుగు చిత్రాల్లో, వీరపాండ్య కట్టబొమ్మన్, సావలే సామలి వంటి తమిళ చిత్రాల్లో నటించారు. ఆమె జగ్గంపేటలో 1929లో జన్మించారు. 1948లో ఆమె నటించిన బాలరాజు చిత్రం విశేషంగా విజయం సాధించింది. తాను నటించిన అన్ని చిత్రాల్లో ఆమె పాటలు పాడారు. ఆమె చిత్ర నిర్మాత ఎఎస్ శ్రీనివాసన్ ను వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఆమెకు 2007లో శివాజీ గణేషన్ స్మారక అవార్డు, 2004లో కవిగ్నర్ కన్నదాసన్ అవార్డు లభించాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X