హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎం రోశయ్యపై హైకోర్టులో పిల్

By Staff
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: ముఖ్యమంత్రిగా కె. రోశయ్య నియామకాన్ని సవాల్ చేస్తూ గుంటూరు జిల్లాకు చెందిన రవి అనే న్యాయవాది రాష్ట్ర హైకోర్టు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. శాసనసభలో బలనిరూపణకు సిద్ధపడాలని రోశయ్యను ఆదేశించాలని ఆయన హైకోర్టును కోరారు. కీలక నిర్ణయాలు తీసుకోకుండా రోశయ్యను నిలువరించాలని కూడా ఆయన కోరారు. గవర్నర్ పిలుపు మేరకు రోశయ్య ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటికీ శాసనసభలో తప్పని సరిగా బలనిరూపణ చేసుకోవాల్సి ఉంటుందని రవి అంటున్నారు.

రాజ్యాంగంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అనే పదం లేకపోయినప్పటికీ శాసనసభలో బలాన్ని నిరూపించుకోనందున రోశయ్యను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పరిగణించాల్సి ఉంటుందని అంటున్నారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత శాసనసభలో రోశయ్య బలనిరూపణకు సిద్ధపడాల్సి ఉంటుంది. తనకు మద్దతు తెలుపుతున్న శాసనసభ్యుల జాబితాను ఆయన గవర్నర్ కు సమర్పించలేదు. మెజారిటీ శాసనసభ్యులున్న కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ రోశయ్యను తన నాయకుడిగా ఎన్నుకోలేదు. దీంతో ఆయనకున్న బలంపై సందేహాలున్నాయనేది వాదన.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X