• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కోర్టులో కుప్పకూలిన అహుజా

By Staff
|

Shiney Ahuja
ముంబై: పని మనిషిపై అత్యాచారం చేసిన కేసులో బాలీవుడ్ నటుడు షైనీ అహుజా శుక్రవారం కోర్టులో వెక్కి వెక్కి ఏడ్చాడు. కోర్టులోనే కుప్పకూలిపోయాడు. ఆరోగ్యం క్షీణించడంతో అతను ఆవరణలో పడిపోయినట్లు చెబుతున్నారు. దాంతో అహుజాను వెంటనే అస్పత్రికి తరలించాలని అతని తరఫు న్యాయవాది కోరారు. అహుజాను ఫాస్ట్ ట్రాక్ కోర్టులోనే వైద్యులు పరీక్షించారు. స్లిప్ డిస్క్ సమస్యతో అతను పడిపోయినట్లు సమాచారం.

అహుజా కోర్టులోకి నడిచి వెళ్లలేని స్థితిలో ఉన్నాడు. దీంతో కానిస్టేబుళ్ల సాయంతో కోర్టులోకి నడిచి వెళ్లాడు. అతన్ని బెంచీపై కూర్చోబెట్టారు. అతను అక్కడే పడుకున్నాడు. అతన్ని ఆస్పత్రికి తరలించాలని అతని తరఫు న్యాయవాది సమీర్ నాగ్రే కోర్టును కోరారు. అహుజాకు వెంటనే చికిత్స అందించాలని, ఆ తర్వాత జెజె ఆస్పత్రికి తరలించాలని కోర్టు జైలు అధికారులను ఆదేశించింది. విచారణను కోర్టు వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X