హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ కోసం ఎమ్మెల్యేల తిరుగుబాటు?

By Staff
|
Google Oneindia TeluguNews

Harsha Kumar
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యులు తిరుగుబాటు స్వరం ఎత్తుకున్నారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయడానికి పార్టీ అధిష్ఠానంపై తిరుగుబాటుకు కూడా వారు సిద్ధపడినట్లు వారు చేస్తున్న ప్రకటనలు తెలియజేస్తున్నారు. జగన్ కోసం త్యాగాలు చేస్తామని అంటున్నవారు రాజీనామాలు చేయాలని అన్న అమలాపురం పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ పై విరుచుకుపడ్డారు. యువ శాసనసభ్యులమంతా జగన్ ను ముఖ్యమంత్రిని చేస్తామని వరంగల్ జిల్లా వర్ధన్నపేట శాసనసభ్యుడు శ్రీధర్ అన్నారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేసే వరకు నియోజకవర్గాలకు రావద్దని ప్రజలు అంటున్నారని ఆయన అన్నారు. హర్షకుమార్ వ్యాఖ్యలు సరైనవి కావని ఆయన అన్నారు.

హర్షకుమార్ పై కాకినాడ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. హర్షకుమార్ చెప్తే వినే స్థితిలో తాము లేమని ఆయన అన్నారు. హర్షకుమార్ రాజీనామా చేసి తిరిగి గెలవాలని ఆయన అన్నారు. హర్షకుమార్ పై రాజోలు శాసనసభ్యుడు రాపాక కూడా ధ్వజమెత్తారు. దమ్ములుంటే హర్షకుమార్ రాజీనామా చేసి తిరిగి గెలవాలని ఆయన అన్నారు. దీన్నిబట్టి జగన్ సూచన మేరకే కొంత మంది శాసనసభ్యులు స్వరం పెంచుతున్నట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X