హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాంధీ జయంతికి 947 మంది జీవితఖైదులు విడుదల

By Staff
|
Google Oneindia TeluguNews

Sabitha Indra Reddy
హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చెయ్యాలనుకున్న సత్ప్రవర్తన కలిగిన జీవితఖైదులకు, అప్పుడు చుక్కెదురైనా గాంధీజయంతి సందర్భంగా విడుదల చేసేందుకు మార్గం సుగమమయింది. అర్హులయిన జీవితఖైదులను విడుదల చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గవర్నర్ ఎన్ డీ తివారీ ఆమోదం కూడా లభించింది.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 947 మంది సత్ప్రవర్తన కలిగిన జీవితఖైదులను విడుదల చెయ్యాలని నిర్ణయించినా జి.సతీష్ అనే న్యాయవాది ఈ విషయమై సుప్రీం కోర్టులో కేసు వెయ్యడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. కానీ సుప్రీం కోర్టు ఆయన పిటీషన్ తిరస్కరించడంతో ఖైదీల విడుదలకు మార్గం సుగమమయింది. ఈ మేరకు హోం మినిష్టర్ సబితా ఇంద్రా రెడ్డి పలుమార్లు జైళ్లు, పోలీసు ఉన్నతాధికారులతో చర్చించి అర్హులైన ఖైదీల జాబితాను విడుదల చేశారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జైళ్ల శాఖకు ప్రభుత్వం గురువారం పంపనుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X