హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భయపడాల్సిన అవసరం లేదు: సబిత

By Pratap
|
Google Oneindia TeluguNews

Sabita Indra Reddy
హైదరాబాద్: వరద తాకిడి ప్రాంతాల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం ప్రజలను రక్షించడానికి అన్ని చర్యలూ తీసుకుంటోందని రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ప్రజలకు నష్టం జరగకుండా కాపాడగలిగామని ఆమె శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అన్ని చర్యలూ తీసుకున్నామని ఆమె చెప్పారు. మానవ ప్రయత్నం ఎంత చేసినా ఏదో మేరకు నష్టం వాటిల్లుతూనే ఉంటుందని, ఇటువంటి ప్రమాదం నుంచి బయటపడడానికి దేవుడి దయ కూడా ఉండాలని ఆమె అన్నారు. కర్నూలులో ప్రజలు ఎంత భయాందోళనలతో ఉన్నారో, మనమంతా కూడా ఇక్కడ అంతే భయాందోళనలకు గురయ్యామని ఆమె చెప్పారు.

కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాలో ఎస్పీలు సహాయక చర్యలను సమన్వయం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఐడి, డిఐజి కర్నూలులోనే ఉన్నారని ఆమె చెప్పారు. అనంతపురం, కడపల నుంచి అదనపు బలగాలను కర్నూలుకు తరలించినట్లు ఆమె తెలిపారు. వరద తాకిడి ప్రాంతాల ప్రజలకు ఆహారం పొట్లాలు అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. సైనిక బలగాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు ఆమె తెలిపారు. ఇద్దరు మంత్రులు జిల్లాలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని ఆమె చెప్పారు. మంత్రాలయంలో కూడా వరద తగ్గిందని ఆమె చెప్పారు. కర్నూలు జిల్లాలో 89 గ్రామాలు ముంపునకు గురైనట్లు ఆమె తెలిపారు. కృష్ణా జిల్లాలో 16 గ్రామాలను ఖాళీ చేయించినట్లు ఆమె చెప్పారు. అవనిగడ్డకు ప్రమాదం పొంచి ఉండడంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X