విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తగ్గుతున్న కృష్ణా వరద ఉధృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Prakasam Barrage
విజయవాడ: కృష్ణా నదిలో వరద ఉధృతి తగ్గుతోంది. నాగార్జున సాగర్ జలాశయం నుంచి ప్రకాశం బ్యారేజీకి నీటి ప్రవాహం తగ్గింది. నాగార్జునసాగర్ నుంచి అవుట్ ఫ్లో 5.5 లక్షల క్యూసెక్కులు ఉండగా, ఇన్ ఫ్లో కూడా అంతే ఉంది. అయితే మరో 24 గంటల పాటు కరకట్టలకు ప్రమాదం ఉంటుందని, జాగ్రత్తగానే ఉండాలని నీటి పారుదల శాఖ అధికారులు అంటున్నారు. విజయవాడలోని కొన్ని ప్రాంతాలు ఇంకా వరదలోనే ఉన్నాయి. కృష్ణా వరద ఉధృతి తగ్గుతుండడంతో ఎగువ ప్రాంతాలు క్రమంగా తెరిపిన పడుతున్నాయి. కృష్ణా జిల్లాలోని నాలుగు మండలాల్లో గల పలు గ్రామాలు ఇంకా వరదలోనే ఉన్నాయి.

కృష్ణా కరకట్టలకు ఎక్కడా లీకేజీలు ఎక్కడా లేవని నీటి పారుదల శాఖ అధికారుల చెబుతున్నారు. అయితే గుంటూరు జిల్లా మాత్రం ఇంకా వరదలతో విలవిలలాడుతూనే ఉన్నది. రేపల్లే పట్టణంలో నాలుగు అడుగుల మేర నీరు చేరి ఉంది. నిత్యావసర సరుకుల కోసం రేపల్లే వాసులు ఇబ్బందులు పడుతున్నారు. పెనుమూడి - రేపల్లెల మధ్య రాకపోకలు స్తంభించాయి. వల్లభాపురం వద్ద స్లూయిజ్ కాలువ గేటు కొట్టుకుపోయింది. దానికి మరమ్మతులు చేయలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X