వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను కులాన్ని నమ్మను: రాహుల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Rahul Gandhi
తిరువనంతపురం: తనకు కుల వ్యవస్థపై నమ్మకం లేదని, నిరుపేదల చెంతకు చేరడమే తన ఉద్దేశమని కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అన్నారు. దళితుల ఇళ్లను సందర్శించడాన్ని రాజకీయ స్టంట్ ప్రతిపక్షాలు విమర్శించడాన్ని ఆయన కొట్టిపారేశారు. తనకు కుల వ్యవస్థపై విశ్వాసం లేదని, తాను దళితుల ఇళ్లకు వెళ్తున్నట్లు అనుకోవడం లేదని, మనుషుల ఇళ్లకు వెళ్తున్నట్లు భావిస్తున్నానని ఆయన బుధవారంనాడు అన్నారు.

తన సందర్శనలను దళితుల ఇళ్ల పర్యటనలుగా మీడియా చిత్రీకరిస్తోందని రాహుల్ అన్నారు. దళితులు అనే చట్రం మీదని, తనది కాదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. పేద గ్రామంలోని అతి పేద కుటుంబాన్ని సందర్శించడానికి ఏర్పాట్లు చేయాలని తాను తన కార్యాలయానికి సూచిస్తానని, అతడిని మీరు దళితుడిగా చూస్తారని, తాను పేదవాడిగా చూస్తానని ఆయన అన్నారు.

తాను టీ కొట్టు వ్యాపారిని, విశ్వవిద్యాలయ విద్యార్థిని ఒకే రకంగా చూస్తానని, నీవు దళితుడివా అని టీకొట్టు వ్యాపారివా అని తాను అడగబోనని, తేడా అవకాశాల్లోనే ఉందని, వారు విశ్వవిద్యాలయానికి వెళ్లడానికి అవసరమైన తెలివితేటలున్నవారని, అయితే వారికి అవకాశాలు రావడం లేదని, అదే తేడా అని ఆయన అన్నారు. తాను మరణించినప్పుడు మాత్రమే నేర్చుకోవడం ఆగిపోతుందని ఆయన చెప్పారు. నేర్చుకోవడం ఆచరణ అని, ఆచరణ నేర్చుకోవడమని ఆయన అన్నారు. మాయావతి వ్యతిరేకించినప్పటికీ తాను పేదల ఇళ్లకు వెళ్లి తీరుతానని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X