వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూజిలాండ్ లో అంధ్ర విద్యార్థి అదృశ్యం

By Pratap
|
Google Oneindia TeluguNews

Srikanth
ఆక్లాండ్: న్యూజిలాండ్ లో హైదరాబాద్ విద్యార్థి అదృశ్యమయ్యాడు. అతను ఈ నెల 1వ తేదీ నుంచి కనిపించకుండా పోయాడు. ఎటిఎం నుంచి డబ్బులు తీసుకున్న మరుక్షణం నుంచి అతని జాడ తెలియడం లేదు. అతను హత్యకు గురై ఉంటాడని అనుమానిస్తున్నారు. ఈ నెల 1వ తేదీన తన మెట్ ఆల్బర్ట్ హోం నుంచి బయటుకు వెళ్లిన 23 ఏళ్ల రాయదుర్గం శ్రీకాంత్ అదృశ్యం కావడంపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రాయదుర్గం శ్రీకాంత్ ఆక్లాండ్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీలో చదువుతున్నాడు. ఆక్లాండ్ హార్బర్ లో రాయి కింద శ్రీకాంత్ బూట్లు, సంచీ,కోటు కనిపించాయి. అతని వాలెట్ సమీపంలోని సైకిల్ ట్రాక్ వద్ద పడేసి ఉంది. రాయదుర్గం శ్రీకాంత్ ఆచూకీ తెలపాలని అతని బావ నగేష్ కుకునూరు కోరుతున్నారు. శ్రీకాంత్ ఇటీవలే ఏడు నెలల క్రితం న్యూజిలాండ్ వచ్చాడని, యూనివర్శిటీకి వెళ్లి ఇంటికి తిరిగి రావడం మాత్రమే చేసేవాడని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X