హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కల్వకుంట్ల బూతులరావు: తులసిరెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Congress
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)అధ్యక్షుడి పైరు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కాదని, కల్వకుంట్ల బూతుల రావని కాంగ్రెసు అధికార ప్రతినిధి తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులు చంద్రశేఖర రావు అని మంచి పేరు పెడితే బూతులరావుగా మారారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. కెసిఆర్ ను అందరూ మర్చిపోయారని, రాజకీయ నాయకులు, తెలంగాణ ప్రజలు, మీడియా కెసిఆర్ ను మర్చిపోయారని, దీంతో వారి దృష్టిని తన వైపు మరల్చుకునేందుకు వికృత చేష్టలకు, వికృతమైన మాటలకు కెసిఆర్ దిగారని ఆయన అన్నారు.

రాయలసీమలో చేపట్టిన ప్రాజెక్టులపై కెసిఆర్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. తాను చెప్పిన బేతాళ మాంత్రికుడు ఎవరో చెప్పాలని ఆయన కెసిఆర్ ను డిమాండ్ చేశారు. కెసిఆర్ రాజకీయ డ్రామా ఆడుతున్నారని ఆయన విమర్శించారు. ప్రజలు రాళ్లతో కొడతారనే భయంతోనే అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆయన కెసిఆర్ పై విరుచుకుపడ్డారు. గతంలో ప్రజల విశ్వాసాన్ని కెసిఆర్ కోల్పోయారని, దాన్ని తిరిగి పొందడానికి అసందర్భపు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X