హైదరాబాదు : మీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి నన్ను పిచ్చోడంటారా? అంటూ కేసీఆర్ తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తారు.అలాగే వరదలు ముమ్మాటికీ మానవ తప్పిదమేనని మరోసారి చెబుతున్నానని, ప్రభుత్వ నిర్లక్ష్యమే వరదలకు కారణమని మరోసారి చెబుతున్నట్లు కేసీఆర్ అన్నారు. తప్పులు ఎత్తి చూపితే మతిస్థిమితం లేదంటారా?.. రండి దమ్ముంటే చర్చ పెట్టండి. నిజాలు నిరూపిస్తా... మీడియా ముందు చర్చిద్దాం... అవాకులు పేల్చినంత మాత్రాన సరిపోదు... తేదీ నిర్ణయించు.. అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాలపై కేసీఆర్ ఎదురు దాడి చేశారు. వెన్ను చూపింది మీరు... మీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి నన్ను పిచ్చోడంటారా? అంటూ కేసీఆర్ సవాల్ విసిరారు.