ఆదిలాబాద్ :తాను ఎస్టీనే అని తన ఎస్టీ రిజర్వేషన్ రద్దుపై న్యాయపోరాటం చేస్తానని సుమన్రాథోడ్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ సభ్యురాలు సుమన్రాథోడ్ ఆదివాసీ కాదని ఆ జిల్లా జాయింట్ కలెక్టర్ సారధ్యంలోని విచారణ కమిటీ ప్రకటించింది.రాథోడ్ ఎస్టీకాదని బీసీ అని ఫిర్యాదులు అందిన నేపథ్యంలో జిల్లాయంత్రాంగం ఈ అంశంపై విచారణ జరిపింది.