వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోల్ కత్తా నైట్ రైడర్స్ హెడ్ కోచ్ వాట్మోర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Whatmore Dev
కోల్ కత్తా: జాన్ బుకానన్ ను తప్పించిన మూడు నెలల తర్వాత కోల్ కత్తా నైట్ రైడర్స్ కోచ్ సమస్య తీరింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపియల్) కెకెఆర్ జట్టు హెడ్ కోచ్ గా దేవ్ వాట్మోర్ నియమితులయ్యారు. వచ్చే ఐపియల్ సీజన్ కు వాట్మోర్ హెడ్ కోచ్ గా వ్యవహరిస్తారు. వాట్మోర్ జాకీయ క్రికెట్ అకాడమీ హెడ్ కోచ్ గా రాజీనామా చేసి వచ్చే సీజన్ కు కెకెఆర్ హెడ్ కోచ్ గా ఒప్పందం కుదుర్చుకున్నట్లు బిసిసిఐ వర్గాలు చెప్పాయి. దీనికి సంబంధించి త్వరలోనే ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నారు.

కెకెఆర్ తో చేతులు కలపడానికి జాతీయ క్రికెట్ అకాడమీకి రెండు రోజుల క్రితం వాట్మోర్ రాజీనామా చేశారని, వాట్మోర్ స్థానంలో ఎవరిని నియమించాలనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని బిసిసిఐ వర్గాలు చెప్పాయి. వాట్మోర్ ఇంతకు ముందు శ్రీలంక, బంగ్లాదేశ్ జాతీయ జట్లకు కోచ్ గా వ్యవహరించారు. కోచ్ పదవికి పలువురు పోటీ పడినప్పటికీ కెకెఆర్ యాజమాన్యం వాట్మోర్ కే ఓటు వేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X