వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా హత్యకు కుట్ర: మమతా బెనర్జీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Mamata Banerjee
కోల్ కత్తా: తన హత్యకు కుట్ర జరిగిందని తృణమూల్ కాంగ్రెసు నేత, రైల్వే మంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ప్రెస్ స్ట్రిక్కర్ అతికించుకున్న కారు ఒకటి కోల్ కత్తా శివారు పట్టణం సాల్ట్ లేక్ లో తన వాహనాన్ని ఢీకొట్టడానికి ప్రయత్నించిందని, ఈ సంఘటన బుధవారం తెల్లవారు జామున జరిగిందని ఆమె ఆరోపించారు. ఆ కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని, ఇద్దరి వద్ద కెమెరాలు ఉన్నాయని, వారి కారు తన కాన్వాయ్ లోకి దూసుకొచ్చిందని ఆమె వివరించారు.

అప్పటికే చాలా ఆలస్యమైందని, వీధి దీపాలు లేవని, ఓ ప్రైవేట్ కారు తన కాన్వాయ్ లోకి దూసుకొచ్చి తన కారు వెనక్కి వచ్చిందని, అది తన కారును ఢీకొట్టడానికి ప్రయత్నించిందని, దాన్ని తప్పించుకోవడానికి చూశామని, అయితే ఆ తర్వాత కూడా అది తన కారు వెనక్కి వచ్చిందని ఆమె చెప్పారు. ఇటువంటి సంఘటనలు నాలుగైదు సార్లు జరిగినట్లు తెలిపారు. తన కాన్వాయ్ లోని పోలీసులు ఆగాలని ఆ కారు ప్రయాణికులకు సూచించారని, అయినా వినలేదని, కాల్పులు జరపవద్దని తాను పోలీసులకు సూచించానని ఆమె చెప్పారు.

తమకు ఫిర్యాదు అందిందని, అది ప్రెస్ కారు అని తేలిందని, ఎవరిని కూడా అరెస్టు చేయలేదని రాష్ట్ర పోలీసు ఇన్ స్పెక్టర్ జనరల్ (శాంతిభద్రతలు) సురజీత్ కార్ పురకాయస్థ చెప్పారు. చివరికి కారును ఆపగలిగామని, డ్రైవర్ వద్ద లైసెన్స్ లేదని, కెమెరాలు ధరించిన వారి వద్ద ఏ విధమైన ప్రెస్ గుర్తింపు కార్డులు లేవని మమత చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X