హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ రాజశేఖర రెడ్డి 'బ్లాక్ బాక్స్' రహస్యం వచ్చేనెల!

By Santaram
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానికి దారితీసిన హెలికాప్టర్ లోని 'బ్లాక్ బాక్స్' లో సంభాషణలపై నివేదిక నవంబర్ రెండు తరువాతనే కేంద్రానికి అందే అవకాశం ఉంది. ప్రమాద సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ), పైలట్ల మధ్య జరిగిన సంభాషణ వివరాలపై 'బ్లాక్ బాక్స్'లోని సంభాషణలను 'డీ కోడ్' చేసిన అమెరికా నిపుణులు తమ నివేదికను వారం క్రితం సమర్పించారు. ఆర్ కే త్యాగి నాయకత్వంలోని కమిటీ విచారణ చేయడానికి రెండు నెలల వ్యవధి ఉంది. వైఎస్ హెలికాప్టర్ కూలిపోవడం వెనుక కుట్ర ఉందని కొందరు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

తాము నివేదిక సమర్పించే ముందు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని త్యాగి చెప్పారు. ఈ దశలో తాము ఎటువంటి వివరాలు వెల్లడించలేనని స్పష్టం చేశారు. వైయస్ ప్రయాణించిన హెలికాప్టర్ ప్రమాదానికి గురైనప్పుడు చెన్నై, బేగం పేటల్లోని ఏటీసీలతో సంబంధాలు తెగిపోయిన విషయం తెలిసిందే. 'బ్లాక్ బాక్స్'లో దాగిన సంభాషణలు వెల్లడైతే ప్రమాదం జరిగిన తీరు తెన్నులు కొంతమేరకైనా వెల్లడయ్యే వీలు ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X