కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంట్రాక్టర్ కిడ్నాప్, ఎమ్మెల్యే హస్తం

By Santaram
|
Google Oneindia TeluguNews

YS Jagan
కడప: నెల్లూరుకు చెందిన ఒక కాంట్రాక్టరును జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరులు కిడ్నాప్‌ చేశారు. నెల క్రితం టెండర్లలో దక్కించుకున్న ఆరుకోట్లరూపాయల విలువ గల రోడ్డు కాంట్రాక్టు పనులు వదులుకోవాలని ఆ కాంట్రాక్టర్‌ని బెదిరించినట్లు తెలుస్తోంది. ఎనిమిది మంది వ్యక్తులు కడప ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కార్యాలయంనుంచి కాంట్రాక్టరుని కిడ్నాప్‌ చేశారు.

ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వైఎస్ కుటుంబానికి సన్నిహితుడు. జగన్ ముఖ్యమంత్రి కావాలంటూ ఆయన ఇప్పటికీ బాహాటంగా ప్రకటనలు ఇస్తున్నారు. ఆదినారాయణ రెడ్డి మాత్రం అసలు ఆయన ఎవరో కూడా తనకు తెలీదని, విపక్షాలు కావాలనే తన మీద బురద జల్లుతున్నాయని ఆయన మండిపడ్డారు. నెల్లూరు జిల్లాకు చెందిన కాంట్రాక్టర్‌ను సాక్షాత్తూ ఎస్ ఇ కార్యాలయంలోకి చొచ్చుకొచ్చిన 10 మంది వ్యక్తులు అపహరించి చితకబాది వదిలిపెట్టారు. నెల క్రితం రోడ్డు పనుల్లో దక్కించుకున్న రూ.6 కోట్ల కాంట్రాక్ట్‌ను వదులుకోవాలని వారు తనను హెచ్చరించారని కాంట్రాక్టర్‌ చెబుతున్నారు. వారంతా ఆదినారాయణ రెడ్డి మనుషులని ఆయన ఆరోపిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X