వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్దీ పిరికి, అపరిక్వ వ్యక్తి: మాజీ ప్రేయసి

By Pratap
|
Google Oneindia TeluguNews

Salman Rushdie
లండన్: భారత సంతతి రచయిత సల్మాన్ రష్దీని మాజీ ప్రియురాలు పియా గ్లెన్ పిరికిపందగా, పరిపక్వత లేని వ్యక్తిగా అభివర్ణించింది. తమ కొద్దికాలం ప్రేమ వ్యవహారం తర్వాత ఆమెను రష్దీ వదిలేశాడు. తనను నుంచి రష్దీ ఏమి ఆశించాడో దాని పట్ల నిజాయితీగా లేడని, రష్దీ కార్యశీలి కారని, ఆయనకు పరిపక్వత కూడా లేదని ఆమె వ్యాఖ్యానించారు.

రష్దీని ఆమె 2007లో కలిసింది. ఏడాది తర్వాత ఆమె ఈ ఏడాది జనవరిలో చివరికి న్యూయార్క్ లోని తన ఇంటికి చేరుకుంది. ఇటలీలోని కాప్రి, లండన్ ల పర్యటన తర్వాత అంతకు మూడు నెలల క్రితమే రష్దీ ఆమెను వదిలేశాడు. సాటానిక్ వర్సెస్ రాసినందుకు ముస్లిం మత పెద్దల ఫట్వాను అందుకున్న రష్దీని పెద్ద సాహసిగా చిత్రీకరించారని, కొన్ని నెలల తన జీవితాన్ని రష్దీ వృధా చేశాడని, పిరిగ్గా తనతో ఇమెయిల్ ద్వారా విడిపోయాడని ఆమె మెయిల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నది.

గ్లెన్ ఆరోపణలను రష్దీ ఖండించాడు. గ్లెన్ నటి కావాలని ఉబలాటపడుతోందని, ప్రచారం కోసమే ఇదంతా చేస్తోందని, ఆమె అభిప్రాయాలన్నీ అబద్దాలేనని అతను అన్నాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X